• Neti Charithra

Coronavirus: యాక్టివ్‌ కేసులు 33,49,644



ఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశంలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 3689 మంది ప్రాణాలు విడిచారు. 3,07,865 మంది ఈ వైరస్‌ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 1,59,92,271గా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,57,457 కరోనా కేసులు నమోదవగా ఇందులో 33,49,644 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం 15,68,16,031 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 2,15,542 మంది కరోనాకు బలయ్యారు.


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7430 కరోనా కేసులు నమోదవగా 56 మంది మరణించారు.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఇప్పటివరకు 3,67,727 మంది డిశ్చార్జ్ అవగా 2368 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 80,695 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీలో 1546, మేడ్చల్‌లో 533, రంగారెడ్డిలో 475, నల్లగొండలో 368, సంగారెడ్డిలో 349 కరోనా కేసులు నమోదవగా వరంగల్‌ అర్బన్‌లో 321, నిజామాబాద్‌లో 301 కేసులు వెలుగుచూశాయి.


నేటి చరిత్ర వాట్సాప్ గ్రూపులో లేరా...


నేటి చరిత్ర - గంట గంటకు న్యూస్ updates మీ whatsapp కే పొందలా..

JOIN WITH BELOW LINK.. Click here

https://chat.whatsapp.com/FE2bKwWpTKFCAXPph3gita


Share with your friends and invite them to join in WhatsApp group to get News updates in WhatsApp.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్