• Neti Charithra

Breaking.. 56 బీసీ కార్పొరేషన్ లకు శుభ వార్త చెప్పిన జగన్ సర్కార్..!


Breaking.. 56 బీసీ కార్పొరేషన్ లకు శుభ వార్త చెప్పిన జగన్ సర్కార్..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో కొత్తగా ఏర్పాటు చేసిన బిసి కార్పొరేషన్ ల పాలక మండ్డళ్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. విజయవాడ

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు

జోగి రమేష్, మల్లాది విష్ణు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.బీసీల సంక్రాంతి పేరుతో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.