• Neti Charithra

Breaking.. 50 అడుగుల లోయలో పడ్డ... మినీ బస్సు బోల్తా.. ఐదుగురు మృతి..!


Breaking.. 50 అడుగుల లోయలో పడ్డ...

మినీ బస్సు బోల్తా.. ఐదుగురు మృతి..!




నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతినిథి)


ప్రయాణికులతో వెళుతున్న మినీ బస్సు బోల్తా పడ్డంతో మహారాష్ట్రలోని సాతారా జిల్లా కరాడ్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ముంబయి నుంచి కొందరు మినీ బస్సులో గోవా వెళ్తుండగా.. పుణె- బెంగళూరు హైవేలో   50అడుగుల

ఎత్తున్న వంతెనపై నుంచి మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గరు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారు. స్థానిక పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


306 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon