• Neti Charithra

Breaking.. 42 ఏళ్ల తర్వాత పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక..!


Breaking.. 42 ఏళ్ల తర్వాత పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక..!



నేటి చరిత్ర-(ప్రత్యేక ప్రతినిథి)


వారు 42 ఏళ్లక్రితం నాటి పూర్వపు విద్యార్థులు.. సుదీర్ఘ కాలం అనంతరం ఒక చోట చేరారు. ఈ అపూర్వ కలయిక పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచెసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లపూడి మండలంలోని వేగేశపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1978-79 పదోతరగతి పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. 42 సంవత్సరాల తర్వాత వారంతా మనుమలు, మనవరాళ్లతో హాజరై ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పూర్వవిద్యార్థి మార్టిన్‌ సుధాకర్‌ మాట్లాడుతూ తామంతా ఒక సంఘంగా ఏర్పడి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నామన్నారు