• Neti Charithra

Breaking... 12 మంది కేబినెట్ మంత్రులకు కరోనా.. ప్రభుత్వం లో కల కలం..!



Breaking... 12 మంది కేబినెట్ మంత్రులకు కరోనా.. ప్రభుత్వం లో కల కలం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



మహారాష్ట్ర లో కేబినెట్ సమావేశానికి హాజరు ఆయిన 12 మంది మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటం కల కలం

రేపుతోంది.ఇటీవల మంత్రి

ఏక్ నాథ్ షిండేకి కొవిడ్ పాజిటివ్ గా

తేలింది. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తూ ఆయన క్వారంటైన్ కి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితమే మహారాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి హాజరైనవారంతా ఏక్ నాథ్ షిండేతో సన్నిహితంగా ఉన్నవారే. అందరూ టెస్ట్ చేయించుకోగా అందులో 12మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. అలా ఏక్ నాథ్ తో కలిపి మొత్తం మహారాష్ట్ర కేబినెట్ లో 13మందిని కరోనా చుట్టేసింది. 

భాతికదూరం పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని వైద్యులు

తేల్చారు. ఇప్పటి వరకూ దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలా జరగలేదు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు కరోనా బారిన పడ్డా.. ఈ స్థాయిలో ఒకే రాష్ట్రంలో ఒకే సారి ఇంతమందికి వ్యాధి సోకలేదు. కచ్చితంగా సదరు మంత్రుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. 


376 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon