- Neti Charithra
Breaking..1100 కిలోమీటర్ ల దూరం లో తిరుపతి లో అదృశ్యం ఆయిన తల్లి..ముగ్గురు పిల్లల ఆచూకీ లభ్యం!
Breaking..1100 కిలోమీటర్ ల దూరం లో తిరుపతి లో అదృశ్యం ఆయిన తల్లి..ముగ్గురు పిల్లల ఆచూకీ లభ్యం!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా తిరుపతిలో అదృశ్యమైన తల్లీ, ముగ్గురు పిల్లల కథ సుఖాంతమైంది. అన్లైన్ డివోషనల్ పేరుతో ఓ స్వామీజీ చెప్పిన మాటలు నమ్మింది తల్లి. స్వామీజీ మాటలకు ప్రభావితమై పిల్లలను వెంటబెట్టుకుని 11 వందల కిలోమీటర్ ల దూరం లోని
షిరిడీకి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. షిరిడీ వెళ్లి వారిని తిరుపతికి తీసుకువస్తున్నారు. తల్లి శ్రీలేఖ, ముగ్గురు పిల్లలు దీక్షిత శ్రీ, తేజశ్రీ, కార్తీక్ను వెంటబెట్టుకొస్తున్నారు పోలీసులు. తిరుపతి కెనడీనగర్కు చెందిన శివకుమార్, శ్రీలేఖ దంపతులకు దీక్షితశ్రీ, తేజస్విశ్రీ, కార్తీక్ సంతానం. శ్రీలేఖ ముగ్గురు పిల్లలతో ఆదివారం మధ్యాహ్నం రిలయన్స్ మార్ట్ కు వెళ్లింది.
షాపింగ్ తర్వాత భర్తకు కాల్ చేసి మాట్లాడింది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో భర్త కంగారుపడ్డాడు. భార్యాపిల్లల కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో
ఫిర్యాదు చేశారు. వారు ఎక్కడికి వెళ్లారు? ఏమయ్యారు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనేది తెలియక కలకలం రేగింది. తల్లి, తన ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోవడం భర్తను, బంధువులను కలవరానికి గురి చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని
తిరుపతి తీసుకోస్టున్నట్లు సమాచారం.