• Neti Charithra

Breaking.. 108 వాహనం ఢీకొని ఒకరు మృతి..కేసు నమోదు చేసిన పోలీసులు..!


Breaking.. 108 వాహనం ఢీకొని ఒకరు మృతి..కేసు నమోదు చేసిన పోలీసులు..!



నందిగామ: నేటి చరిత్ర


రోడ్డు పై నడిచి వెళుతున్న వి యువకున్ని 108 వాహనం ఢీకొనడంతో అతను చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామ లోని

బోర్‌ వెల్‌ కంపెనీలో పనిచేయడానికి ఆదివారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. సోమవారం సాయంత్రం అతడు రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు

వెళ్తున్న 108 వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలవడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.