• Neti Charithra

Breaking.. హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గా ఐఏఎస్ భరత్ గుప్తా నియామకం..!


Breaking.. హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గా

ఐఏఎస్ భరత్ గుప్తా నియామకం..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో ఎన్నికల సంఘం బదిలీ చేసిన ఇద్దరు ఐఏఎస్ అధికారులను కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యంగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భరత్ గుప్తా బదిలీ కాగ

అలాగే గ్రామ, వార్డు సచివాలయం డైరెక్టర్‌గా కూడా భరత్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరో వైపుఎస్సీ కార్పొరేషన్ ఎండీగా శామ్యూల్ ఆనంద్ కుమార్ నియమితులయ్యారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్‌గా జి.నవీన్ బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం చర్యల్లో భాగంగా బదిలీ అయిన అధికారులు ఎట్టకేలకు కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.