• Neti Charithra

Breaking..హార్సిలీహిల్స్ సమీపంలోచిరుత దాడి.. రెండుజింకలు మృతి.. ఆరు గ్రామాల్లో భయం..భయం..!


Breaking..హార్సిలీహిల్స్ సమీపంలో చిరుత దాడి..రెండుజింకలు మృతి..

ఆరు గ్రామాల్లో భయం..భయం..!



హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ సమీపం లో చిరుత దాడి చేయటం తో రెండు జింకలు మృతి చెందిన ఘటన గురువారం కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. హార్సిలీహిల్స్ దిగువన బయ్యప్ప గారిపల్లి గ్రామం సరిహద్దు లో ఇటీవల చిరుత పులి సంచరిస్తున్నట్లు పరిసర గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చిరుత దాడి లో రెండు జింక పిల్లలు మృతి చెందిన ఆనవాళ్ళును స్థానికులు గుర్తించారు. చిరుత సంచారాన్ని కొందరు స్వయంగా చూచి నట్లు చెబుతున్నారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులు కు

అందించటం తో ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది మృతి చెందిన జింకల కళేబరాలు ను ఖననం చేశారు. ఈ విషయమై డిప్యూటీ రేంజ్ అధికారి

మదన్ మోహన్ మీడియా తో మాట్లాడుతూ జింకలు పై దాడి చేస్తున్నది చిరుత పులినా.. లేక కొత్త రకం అటవీ జంతువు నా.. అనే విషయం పూర్తి స్థాయి లో విచారించాల్సి ఉందన్నారు. అయితే తాజా ఘటన లు పరిసర గ్రామలైన నాయన బావి, కంబలపల్లె, బయ్యప్ప గారిపల్లె, మొగసాలమర్రి, అనంతా పురం,దిగువ పల్లె పరిసర గ్రామాల్లో ప్రజలు భయం తో వణుకుతున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్