- Neti Charithra
Breaking... హార్సిలీహిల్స్ సమీపంలో కారు బోల్తా.. పిటిఎం మండల వాసి మృతి..!
Breaking... హార్సిలీహిల్స్ సమీపంలో కారు బోల్తా.. పిటిఎం మండల వాసి మృతి..!
కురబలకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ సమీపం
లోని బి కొత్తకోట- అంగళ్ళు మార్గం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట మలుపు వద్ద కారు బోల్తా పడటంతో పిటిఎం మండల వాసి మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పిటిఎం మండలం బొమ్మిరెడ్డి గారి పల్లె కు చెందిన మంజునాథ్ రెడ్డి మదనపల్లె లోని
(కారు ప్రమాదం లో మృతి చెందిన మంజునాథ్ రెడ్డి)
నిరుగట్టువారిపల్లె లో మగ్గాలు నిర్వహణ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి స్వగ్రామం నుండి మదనపల్లె కు కారులో వెళుతుండగా చెన్నామర్రి సమీపం అక్కగార్లు మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. సీటు బెల్టు లేనికరణంగా మంజునాథ్ రెడ్డి ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.