• Neti Charithra

Breaking..హార్సిలీహిల్స్ లో 30 సంవత్సరాలు..తర్వాత ఒక్కరు ఉంటే..ఒట్టు..!


Breaking..హార్సిలీహిల్స్ లో 30 సంవత్సరాలు..తర్వాత ఒక్కరు ఉంటే..ఒట్టు..!


హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పర్యటక కేంద్రం హార్సిలీహిల్స్ 30 సంవత్సరాల అనంతరం మొదటి సారి ముగబోయింది. న్యూఇయర్ వచ్జిందంటే చాలు .. డిసెంబర్ 31, జనవరి1 తేదీలలో హార్సిలీహిల్స్ లో ఇసుక వేస్తే రాలని జనం.. రద్దీ సహజంగా ఉంటుంది. గత పదేళ్లుగా బుల్లితెర నటుల తో హార్సిలీహిల్స్ దద్దరిల్లేది. ఈ వేడుకలకు గత 30 ఏళ్లుగా పర్యాటకులు హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు,


( డిసెంబర్ 31 గురువారం రాత్రి వెల వెల బోతున్న హార్సిలీహిల్స్)

విజయవాడ, కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చేవారు. పర్యాటకుల రద్దీ ని కట్టడి చేసేందుకు పలువురు సర్కిల్ ఇన్స్ పెక్టర్ల తో పాటు పలు స్టేషన్ ల సబ్ ఇన్స్ పెక్టర్ లు వంద మందికి పైగా పోలీస్ సిబ్బంది భద్రతా చర్యలు చూసేవారు.ఇది గతం. ఈ సారి కోవిద్ ఆంక్షలుతో న్యూఇయర్ వేడుకలు రద్దు అయ్యాయి. దింతో పరిస్థితి భిన్నంగా మారింది. సహజంగా న్యూఇయర్

వస్తోందంటే.. మూడు నెలలకు ముందుగానే పర్యాటక శాఖతో పాటు ప్రయివేటు అతిథి గృహాలు రిజర్వ్ అయ్యేవి. ఈ ఏడాది అందుకు భిన్నంగా హార్సిలీహిల్స్ వేడుకలు తో పాటు పర్యాటకులు లేక హార్సిలీహిల్స్ బోసి పోవడం పర్యటకుల్ని తీవ్ర నిరాశ పరిచటమే కాక పర్యాటక శాఖలో రిజర్వ్ చేసుకున్న పలు అతిథి గృహాల రిజర్వేషన్ లు రద్దు చేసుకున్న ఘటన లు చోటుచేసుకున్నాయి. పలు

ప్రయివేటు అతి థి గృహాల పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారింది.

డిసెంబర్ 31 రాత్రి హార్సిలీహిల్స్ ఆరు బయట ఒక్క పర్యటకుడు.. ఆరు బయట ఉంటే..ఒట్టు అన్నచందంగా పరిస్థితి నెలకొంది.

ఏది ఏమైనా 2020 న్యూఇయర్ సంబరాలు లేక వెల వెల బోవడం గత 30 ఏళ్ళలో ఇది మొదటి సారి కావడం ఈ ఏడాది చేదు గుర్తులలో హార్సిలీహిల్స్ కూడా చేరటం విశేషం.