• Neti Charithra

Breaking.. హార్సిలీహిల్స్ లో 2021 జనవరి 1 వేడుకలు ఎలా..జరిగాయి..అంటే..!


Breaking..

హార్సిలీహిల్స్ లో 2021 జనవరి 1 వేడుకలు ఎలా..జరిగాయి..అంటే..!



హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ లో పర్యాటకులు శుక్రవారం సందడి చేశారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో అధికారిక వేడుకలు రద్దు చేయగా ఆర్టీసీ బస్సులు కూడా నడవక పోవడంతో తో పర్యటకులు అవస్థలు పడ్డారు. పోలీస్ శాఖ ద్విచక్ర వాహనాలు, ఆటోల

రాకపోకలను నిషేధించడం తో కాలినడకన పర్యాటకులు హార్సిలీహిల్స్ చేరుకున్నారు. మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బి కొత్తకోట, ముదివేడు ఎస్ ఐ లు సునీల్ కుమార్, సుకుమార్ లు సిబ్బంది చే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు భద్రతా చర్యలు

తీసుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన పర్యాటకులు అధిక శాతం కాలినడకన హార్సిలీహిల్స్ కు చేరుకోగ తిరుగు ప్రయాణం లో బస్సుల వసతి లేక పర్యాటకులు అవస్థలు పడ్డారు.కార్లు, ఇతర వాహనాల్లో చేరుకున్న పర్యటకులతో పలు

చోట్ల సందడి నెలకొంది. ఏనుగు మల్లమ్మ ఆలయం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టూరిజం మేనేజర్ సాల్విన్ రెడ్డి పర్యాటకులకు అవసరం అయిన ఆహార పదార్థాలను సిబ్బంది చే అందుబాటులో ఉంచారు.