• Neti Charithra

Breaking... హార్సిలీహిల్స్ లో భారీ నష్టం.. .మూడు రోజులుగా అంధకారం.. !


Breaking... హార్సిలీహిల్స్ లో భారీ నష్టం..

.మూడు రోజులుగా అంధకారం.. !


హార్సిలీహిల్స్: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ లో గాలి వాన భీభక్షం చేసింది. ఈ దురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డం తో హిల్స్ లో విద్యుత్ సరఫరా మూడు రోజులుగా నిలిచిపోయింది. పలు చోట్ల ఘాట్ రోడ్ లో చెట్లు కూలి రోడ్డు పై పడ్డాయి. హిల్స్ లోని అటవీశాఖ సముదాయం లోను పలు వృక్షాలు పడ్డంతో ప్రహరి గోడలు

దెబ్బతిన్నాయి. హిల్స్ లో అర్ధరాత్రి

విద్యుత్ స్తంభాలు విరిగి నివాస గృహాలు పై పడగ విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మూడు రోజులు అవుతున్నా విద్యుత్ సరఫరా లేక పోవడంతో తో అంధకారం నెలకొంది. మరో వైపు విద్యుత్ సరఫరా లేని కారణంగా తాగునీటి కట కట నెలకొంది. మూడు రోజులుగా పూర్తిగా విద్యుత్ సరఫరా లేని కారణం గా సెల్ టవర్లు పనిచేయక ఫోన్ లు సైతం ముగబోతున్నాయి.