• Neti Charithra

Breaking..హార్సిలీహిల్స్ న్యూ ఇయర్ వేడుకల పై పోలీస్ ఆంక్షలు..ఆ..మద్యం బాటిళ్లతో పట్టుపడితే అరెస్టులు


Breaking..హార్సిలీహిల్స్ న్యూ ఇయర్ వేడుకల పై పోలీస్ ఆంక్షలు.. ఆ...మద్యం బాటిళ్లతో పట్టుపడితే అరెస్టులు!



హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


(మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్)


చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ లో నూతన సంవత్సర వేడుకలపై పోలీస్ శాఖ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోవిడ్ మార్గదర్శకాలు మేరకు.. హార్సిలీహిల్స్ లో న్యూ ఇయర్ వేడుకల పైన పలు ఆంక్షలు అమలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా డిసెంబర్31 ఉదయం నుంచి జనవరి 1 రాత్రి వరకు హార్సిలీహిల్స్ లో ద్విచక్రవాహనాలు తో పాటు ఆటో ల రాక పోకలపై నిషేధం కొనసాగుతుందని అన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం నిషేధం అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపర చర్యలు తప్పవని ఆయన

హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లతో పట్టుపడితే కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బి కొత్తకోట, ముదివేడు, నిమ్మనపల్లె పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.