• Neti Charithra

Breaking.. హార్సిలీహిల్స్ టోల్ గేట్ వేలం లో ప్రభుత్వానికి రూ.12.01లక్షలు భారీ ఆదాయం..!


Breaking.. హార్సిలీహిల్స్ టోల్ గేట్ వేలం లో

ప్రభుత్వానికి రూ.12.01లక్షలు భారీ ఆదాయం..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ టోల్ గేటు ప్రవేశ రుసుం వేలం పాటల్లో భారీగా

రూ.12.01 లక్షలు ఆదాయం లభించినట్లు మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి పేర్కొన్నారు.

వేలం పాటలో నిర్ణయించిన రేట్లు ప్రకరమే వాహనధారుల నుండి టోల్ గేట్ ఫీజు వసూలు చేయాలని ఆమె అన్నారు.సోమవారం సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు సబ్ కలెక్టర్ సమక్షంలో చిత్తూరు జిల్లా, మదనపల్లి రెవెన్యూ డివిజన్, బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు గ్రామం వద్ద, హర్సీలీ హిల్స్ కొండపైకి వెళ్లే వాహనదారుల నుండి టోల్ గేట్ ఫీజు వసూలు చేయుటకు ఒక సంవత్సరం కాలపరిమితికి

సంబంధించి నిర్వహించిన వేలం పాటలో 27 మంది పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ గారు ప్రభుత్వ పాటగా రూ. 11 లక్షలు నిర్దేశించగా, ఈ వేలం లో పాల్గొన్న 27 మందిలో రూ.12 లక్షల ఒక్క వెయ్యి, మదనపల్లి పట్టణం, రెడ్డీస్ కాలనీకి చెందిన టి. రామంజులు రెడ్డి ఎక్కువగా వేలం పాట పాడడంతో, ఒక సంవత్సర కాలమునకు హార్సిలీహీల్స్ కొండపైకి వెళ్లే వాహనదారుల నుండి టోల్ గేట్ వసూలు చేసుకొనుటకు అనుమతిని పొందడం జరిగిందని సబ్ కలెక్టర్ తెలియజేశారు. రూ.12 లక్షల ఒక్క వెయ్యికి గాను 10 శాతం సెక్యూరిటి డిపాజిట్ (రూ.1,20,100) రెండు రోజుల లోపు చెల్లించాలని, జూన్ లోగా 40 శాతంను, మిగిలిన 50 శాతాన్ని జూలై మాసంలో చెల్లించాలని సబ్ కలెక్టర్ అతనికి సూచించారు. ద్విచక్ర వాహనమునకు రూ.20, మూడు చక్రాల వాహనమునకు రూ.60, నాలుగు చక్రముల వాహనాలకు రూ.70, బస్సు,లారీ, మినీ వాహనాలకు రూ.120 వసూలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే వసూలు చేసుకోవాలని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన వేలం లో పాల్గొన్న 27 మంది చెల్లించిన ధరావత్తు ఫీజు రూ. 13,500 లను టౌన్ షిప్ అభివృద్దికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆఫీసు డి.ఏ.ఓ శంషీర్ ఖాన్, జూనియర్ సాహయకులు వసీం అక్రమ్, వేలం పాట ధారులు, తదితరులు పాల్గొన్నారు.