• Neti Charithra

Breaking.. హార్సిలీహిల్స్ టోల్ గేట్ వసూళ్లు..లక్షల్లో స్వాహా.. ఇద్దరు రెవిన్యూ ఉద్యోగులు సస్పెండ్..!


Breaking.. హార్సిలీహిల్స్ టోల్ గేట్ వసూళ్లు..లక్షల్లో స్వాహా.. ఇద్దరు రెవిన్యూ ఉద్యోగులు సస్పెండ్..!


హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ టోల్ గేట్ బాధ్యతలు చూస్తున్న ఇద్దరు రెవిన్యూ సిబ్బంది( విఆర్ ఏ లు)లను బి కొత్తకోట తహసిల్దార్ నిర్మలా దేవి సస్పెండ్ చేశారు. హార్సిలీహిల్స్ టోల్ గేటు వాహనాల ప్రవేశ రుసుము వసూళ్లకు ఇద్దరు విఆర్ ఏ లను ప్రభుత్వం చాలా కాలం క్రితం నియమించింది. వీరిపై ఫిర్యాదులు రావడంతో మూడు రోజుల క్రితం మదనపల్లె సబ్ కలెక్టర్ ఓ ప్రయివేటు వాహనంలో హార్సిలీహిల్స్ వచ్చారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖతో సంబంధం లేని వ్యక్తి నేరుగా సబ్ కలెక్టర్ వెళుతున్న వాహనం వద్దకు వచ్చి వాహన ప్రవేశ రుసుము ను వసూలు చేసినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఉండాల్సిన ఓ విఆర్ ఏ పొలాలు పనులకు వెళ్లగా, మరో విఆర్ ఏ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నట్లు సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ జాహ్నవి వీరిపై చర్యలు తీసుకోవాలని బి కొత్తకోట తహసిల్దార్ నిర్మల దేవి కి అదేశించగా కోటావురు విఆర్ ఏ లు వెంకట రమణ, మస్తాన్ లను గురువారం సస్పెండ్ చేస్తూ తహసిల్దార్ ఆదేశాలు జారీ చేశారు.

టోల్ గేట్.. స్కామ్.. బట్టబయలు..!


హార్సిలీహిల్స్ టోల్ గేట్ ప్రవేశ రుసుం నిధుల లో స్కామ్ జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.విశ్వసనీయ సమాచారం మేరకు..2008 నుంచి హార్సిలీహిల్స్ టోల్ గేట్ ను రెవిన్యూ సిబ్బంది నిర్వహణ చేస్తున్నారు. సుమారు 12 ఏళ్ల కాలం లో వసూలు అయిన టోల్ గేటు నిధులు నేటికి రూ.5 లక్షలు దాటలేదని టోల్ గేట్ బ్యాంక్ అకౌంట్ నిల్వలు చెబుతున్నాయి. చాలా కాలం గా హార్సిలీహిల్స్ టోల్ గేట్ నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు తహసిల్దార్ లతో పాటు వారి కింద బాధ్యతలు చూసే పలువురు అధికారులు చొరవతో టోల్ గేట్ సిబ్బంది కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది. హార్సిలీహిల్స్ కు తరచుగా ఆతిథ్యం కోసం వచ్చే కొందరు అధికారులు ఖర్చు పేరుతో ఈ టోల్ గేట్ నిధులు అడ్డదారి లో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు మూడు రోజుల క్రితం మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి ఓ ప్రయివేటు వాహనం లో హార్సిలీహిల్స్

కు రాగ అసందర్భం లో విధుల్లో ఉండాల్సిన ఇద్దరు వి ఆర్ ఓలు సొంత పనులు చూసుకుంటుండగా ఓ ప్రయివేటు వ్యక్తి

నేరుగా సబ్ కలెక్టర్ వద్దే ప్రవేశ రుసుము వసూలు చేయగా ఈ సందర్భంగా సదరు వ్యక్తి సబ్ కలెక్టర్ కు ఇచ్చిన నగదు రసీదు నకిలీ ది కావటం అధికార వర్గాల్లో కల కలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు విఆర్ ఏ లను సస్పెండ్ చేయగా ఈ తతంగం పై మదనపల్లె సబ్ కలెక్టర్ టోల్ గేట్ నిధుల అక్రమాల లో ఎవరెవరి పాత్ర ఉంది అని వ్8శయలు పై

పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే లక్షల్లో ఈ నిధులు దుర్వినియోగం అయినట్లు ఉన్నతాధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

807 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon