• Neti Charithra

Breaking.. హైదరాబాదు నుంచి వెళుతున్న వాహనం బోల్తా.. 13 మంది సజీవ దహనం..!



Breaking.. హైదరాబాదు నుంచి వెళుతున్న వాహనం బోల్తా.. 13 మంది సజీవ దహనం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


పాకిస్థాన్‌లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను బోల్తా కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిశాయి.

ఒక్కసారిగా ఎగిసిన మంటలకు

అందులో ప్రయాణిస్తున్న

13 మంది అక్కడికక్కడే

సజీవదహనమయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి, డ్రైవర్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వ్యానులో 20 మంది ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కరాచీ వస్తున్న సమయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కారు కింది భాగంలో ఉండే ‘టై రాడ్‌’ విరిగిపోవడం వల్లే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో వాహన వేగం అధికంగా ఉండడంతో బోల్తా కొట్టిన

వ్యానులో వెంటనే మంటలు అంటుకున్నాయని కరాచీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అవి కాస్తా ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయని.. దీంతో ప్రయాణికులు మృతి చెందారని వెల్లడించారు.