- Neti Charithra
Breaking... హైడ్రామాల మధ్య.. మదనపల్లె లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు..!
Breaking... హైడ్రామాల మధ్య..
మదనపల్లె లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో కలకలం రేపిన శ్రీరాములు కిడ్నాప్ కేసు హైడ్రామాల మధ్య సుఖాంతం అయ్యింది. వలసపల్లె కు చెందిన శ్రీరాములు భూ అమ్మకాల కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు తో వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీరాములు నాలుగు రోజుల
క్రితం అదృశ్యం కావటంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మదనపల్లె మున్సిపల్ అధికారి శ్రీనివాసులు తో పాటు నలుగురి పై స్థానిక పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తాజాగా శ్రీరాములు ఆదివారం పోలీసుల ఎదుట హాజరు అయ్యాడు. ఇతని మిత్రుని వద్ద మూడు రోజుల పాటు ఇండస్ట్రీయల్ గౌడౌన్ లో ఉండి తాజాగా బోయకొండ సమీపం లో
శ్రీరాములు ఉన్న సమాచారం అందుకున్న తాలుకా పోలీసులు అతన్ని అదుపు లోకి తీసుకొని విచారించగా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పేర్కొన్నట్లు సమాచారం. పట్టణం లో వివాదంగా మారిన ఈ కేసు ను హైడ్రామాల మధ్య పోలీసులు ఛేదించారు.