- Neti Charithra
Breaking... హత్య కేసులో చేతి వాటం..ప్రదర్శించి.. నిందితున్ని తప్పించి న సీఐ..నుసస్పెండ్ చేసిన డీజీపి
Breaking... హత్య కేసులో చేతి వాటం.. ప్రదర్శించి .. నిందితున్ని తప్పించి న సీఐ.. ను సస్పెండ్ చేసిన డీజీపీ..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
హత్య కేసులో చేతి వాటం.ప్రదర్శించి.. ఓ నిందితున్ని తప్పించి ననెల్లూరు జిల్లా గూడూరు రూరల్ సీఐ కె.రామకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. చిల్లకూరు
మండలం వడ్డికండ్రిగలో ఈ ఏడాది మార్చి 20న ఓ వివాదంలో ఒకరు హత్యకు గురికాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై అప్పట్లో చిల్లకూరు పోలీసుస్టేషన్లో పలువురిపై హత్య కేసు నమోదైంది. ఈ కేసులో ప్రమేయమున్న ఓ నిందితుడ్ని రూరల్
సీఐ ఉద్దేశపూర్వకంగా తప్పించారంటూ
బాధిత కుటుంబికులు ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై ఎస్పీ విచారణకు సైతం ఆదేశించారు. ఈ క్రమంలో సీఐని సస్పెండ్ చేస్తూ తాజాగా
ఉత్తర్వులు వెలువడ్డాయి.
647 views0 comments