• Neti Charithra

Breaking.. హత్య కేసు నిందితునితో.. బి కొత్తకోట లో కర్ణాటక పోలీసుల హైరానా..!


Breaking.. హత్య కేసు నిందితునితో.. బి కొత్తకోట లో కర్ణాటక పోలీసుల హైరానా..!
బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో కర్ణాటక పోలీసులు మూడు గ్రాముల బంగారు కోసం మూడు వాహనాలలో వచ్చి స్థానికులను హదలెత్తించి న ఘటన చోటుచేసుకుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు..


ఏం.. జరిగిందంటే..

కర్ణాటక రాష్ట్రం బట్లపల్లె సమీపం లోని కోనపురం వద్దగత నెల 19 న ఓ వివాహిత హత్యకు గురైంది. ఈ కేసులో బి కొత్తకోట మండలం గట్టు గ్రామం గట్లమీద పల్లె కు చెందిన శంకర్ రెడ్డినిందితునిగా ఉన్నాడు.

ఆ హత్య సందర్భంగా మహిళ మెడలోని ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక పోలీసులు మూడు వాహనాల్లో పదుల సంఖ్య లో

భారీ గాశనివారం బి కొత్తకోట కు విచ్చేశారు. కర్ణాటక పోలీసులు చేసిన హడావిడి తో స్థానికులు హైరానా పడ్డారు. కొద్ది గంటల

పాటు హైడ్రామా నడిచింది. ఏం.. జరిగిందో నంటూ స్థానికులు కూడా భారీగా గుమి కూడారు. తీరా చూస్తే మూడు గ్రాముల బంగారు తాళిబొట్టును ఓ బంగారు షాపు నుంచి రికవరీ లో భాగంగా తీసుకెళ్లడం.. ఔరా.. మూడు గ్రాముల బంగారు కు మూడు వాహనాల్లో పోలీసుల హడావిడి జరిగిందంటూ.. పలువురు ముక్కున వేలేసుకున్నారు.