• Neti Charithra

Breaking.. హత్యకేసులో 12 మంది నిందితులను అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు..!



Breaking.. హత్యకేసులో 12 మంది నిందితులను అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


(హత్య కేసులో 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట పట్టణ శివారు

ఆలేటివారిపల్లె లో ఈ నెల 18 న జరిగిన హత్య కేసులో 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఎస్ ఐ సునీల్ కుమార్ తో

కలిసి ఆయన మీడియా తో మాట్లాడుతూ

ఈ నెల 18 వ తేది రాత్రి హత్య కు గురై న కూరాకుల వెంకటరమణ హత్య కేసు లో

ఆలేటివారిపల్లె కు చెందిన నిందితులు G.రెడ్డెప్ప, .G వెంకటరమణ మరియు వారి బందువులు మొత్తం 12 మందిని అరెస్ట్

చేశామన్నారు. ఈ కేసు లో అలేటిపల్లి గ్రామ కాపురస్తుడైన మృతుడు కూరకుల

వెంకటరమణ కుటుంబానికి మరియు ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదే గ్రామానికి చెందిన గురికాని రెడ్దేప్పకు మద్య ఇంటి జాగా మరియు పొలం వద్దబోరు విషయం గా సుమారు 3 సం లుగా తగాదాలు

కొనసాగుతుండగాఈ నెల 18 వ తేది న మద్యానం G. రెడ్డెప్ప బందువు అయిన సుబ్రమన్యం యొక్క భార్య తో మృతుని చిన్న కొడుకు శ్రీనివాసులు అసభ్యకరం గా ప్రవర్తించిన విషయాన్ని అడ్డుపెట్టుకొని G.రెడ్డెప్ప తన బంధువులను ఏకం చేసి

పాత కక్షలు తీర్చుకోవాలని మృతుని ఇంటివద్ద కు వెళ్లి మారణాయుదాలతో తన బంధువుల తో కలిసి జరిపిన దాడి లో

గాయపడిన కూరాకుల వెంకటరమణ చికిత్స పొందుతూ మరణించినాడు. దీని పై 19 వ తేదీ న కేసు నమోదు చేసిన పోలిస్ లు దర్యాప్తు చేసి ముద్దాయిలు G.రెడ్డెప్ప, తదితరు లు 12 మంది నిన్నటి రోజున సాయంత్రం అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండు కు పంపినట్లు తెలిపారు.