- Neti Charithra
Breaking.. స్మగ్లింగ్ చేస్తూ.. పోలీసులకు పట్టుపడ్డ గ్రామ వాలంటీర్ .. భారీగా గంజాయి స్వాధీనం..!
Breaking.. స్మగ్లింగ్ చేస్తూ.. పోలీసులకు పట్టుపడ్డ గ్రామ వాలంటీర్ .. భారీగా గంజాయి స్వాధీనం..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఆదర్శంగా.. పారదర్శకంగా ఉండాల్సిన
గ్రామ వాలంటీర్ అక్రమార్జనకు తెరలేపాడు. స్మగ్లింగ్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ఘటన కృష్ణా జిల్లా లో చోటుచేసుకుంది.
నందిగామ డీఎస్పీ రమణమూర్తి
కథనం మేరకు..పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామానికి చెందిన వాలంటీర్ కోపూరి నాగబాబు గోదాంలో గుట్కా, ఖైనీ, గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు ఎస్సై రామకృష్ణ, సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారు. రూ.89,500 విలువైన సరకు పట్టుకున్నారు. వాలంటీరు ఇచ్చిన
సమాచారం మేరకు నందిగామకు చెందిన బచ్చు వెంకటరామలింగేశ్వరావు అలియాస్ శివ గోదాంలో రూ. 12.15 లక్షలు విలువైన సరకు స్వాధీనం చేసుకున్నారు. వాలంటీర్ నాగబాబు, శివలను అరెస్టు చేశారు. వారికి సరకు సరఫరా చేస్తున్న గుంటూరు జిల్లా శావల్యాపురానికి చెందిన గుత్తా హనుమంతరావు, కర్ణాటక రాష్ట్రం తుమ్కూరుకు చెందిన గణేష్ ఎంటర్ప్రైజెస్ యజమానిపై కేసులు పెట్టారు. శివపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.