• Neti Charithra

Breaking.. స్థానిక సంస్థల ఎన్నికల పై ఏం.. చేద్దాం..ఎలా చేద్దాం.. సీఎం జగన్ కీలక.. సమావేశం..!


Breaking.. స్థానిక సంస్థల ఎన్నికల పై

ఏం.. చేద్దాం..ఎలా చేద్దాం..

సీఎం జగన్ కీలక.. సమావేశం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఏపీ రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటీఫ్ కేషన్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అడ్వకేట్ జనరల్ తోపాటు పలు కీలక శాఖల అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్వకేట్ జనరల్ తో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న సందర్భంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సోమవారం కానీ ఆ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం లేదు. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశానికి పంచాయతీ రాజ్ అధికారులు రాకపోవడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను బదిలీ, విధుల నుంచి తప్పించడంపై కూడా జగన్ అహసనంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.