• Neti Charithra

Breaking..సంతకానికి.. రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన విద్యాశాఖాధికారి..!


Breaking..సంతకానికి.. రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన విద్యాశాఖాధికారి..!


హైదరాబాదు: నేటి చరిత్ర


ఓ ప్రయివేటు పాఠశాల పదవ తరగతి వరకు అప్ డేట్ కోసం దరఖాస్తు చేసుకున్న నిర్వాహకుల నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ విద్యాశాఖ సహాయ సంచాలకులు (డివోఈ ఓ) ఏసీబీ కి చిక్కిన ఘటన తెలంగాణా లో చోటుచేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలను పదో తరగతి దాకా స్థాయి పెంచుకొనేందుకు అనుమతి కోరుతూ మూడు నెలల క్రితం

కరస్పాండెంట్ శివశంకర్‌ పాఠశాల విద్యాశాఖకు దరఖాస్తు చేశారు. రూ. 40 వేలు ఇస్తేనే పని అవుతుందని విద్యాశాఖ సహాయ సంచాలకులు బొడ్ల శ్రీనివాస్‌ కరాఖండిగా చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. లంచం తీసుకున్న శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. పద్మారావునగర్‌లోని నిందితుడి ఇంట్లోనూ సోదాలు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.