- Neti Charithra
Breaking... స్టేషన్ బెయిల్ కు రూ.5లక్షలు లంచం తీసుకుంటూ..ఎసిబి కి చిక్కిన సర్కిల్ ఇన్స్పెక్టర్..!
Breaking... స్టేషన్ బెయిల్ కు రూ.5లక్షలు లంచం తీసుకుంటూ..ఎసిబి కి చిక్కిన సర్కిల్ ఇన్స్పెక్టర్..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
స్టేషన్ బెయిల్ కు రూ.5 లక్షలు డిమాండ్ చేసి ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఏసీబీ కి చిక్కిన ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనిశా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
ఇన్‌ఛార్జి డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణానికి చెందిన బత్తుల సుధాకర్ అనే వ్యక్తి ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఈ నెల 8వ తేదీన అరెస్టు అయ్యారు. అతడికి బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ రూ.5
లక్షలను లంచంగా డిమాండ్ చేశారు. ఆ మొత్తంలో నుంచి సీఐ మొదటి వాయిదాగా నిందితుడి నుంచి రూ.1,39,500 తీసుకొని అదేరోజు(8న) విడుదల చేశారు. మిగిలిన నగదు కోసం సీఐ వేధించసాగారు. అది భరించలేని బాధితుడు సుధాకర్ ఈ నెల 19న అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనిశా అధికారులు
శుక్రవారం తెల్లవారుజామున కామారెడ్డి పట్టణంలో సీఐ నివసించే ఇంటికి చేరుకొని సోదాలు ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సోదాల్లో సీఐ అవినీతికి సంబంధించి పలు ఆధారాలు లభించాయని, ఆయనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.