• Neti Charithra

Breaking.. సహజీవనం చేస్తూ..చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న యువతి..యువకుడు..!


Breaking.. సహజీవనం చేస్తూ..చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న యువతి..యువకుడు..!


తిరుపతి:నేటి చరిత్ర


సహజీవనం చేస్తూ..ఓ యువతి.. మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా లో కల కలం రేపింది.

రేణిగుంట అర్బన్‌ సిఐ అంజూయాదవ్‌ కథనం మేరకు.. తిరుపతికి చెందిన అనిత (31), పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకటేష్‌ (35) తోపుడు బండిని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ 13 ఏళ్లుగా తిరుపతి సత్యనారాయణపురంలో

సహజీవనం చేస్తున్నారు. రెండు రోజుల కిందట వీరు రేణిగుంటలోని ఒకే లాడ్జిలో వేర్వేరు గదులను అద్దెకు తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం లాడ్జి సిబ్బంది వారిద్దరి గదులను తట్టినా ఎంతసేపటికీ తెరవకపోవడంతో లాడ్జీ యాజమాన్యం పోలీసులకు సమాచారాన్ని అందించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా, ఒక గదిలో అనిత ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో గదిలో వెంకటేష్‌ బెడ్‌పై విగతజీవిగా పడిఉన్నాడు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.