• Neti Charithra

Breaking.. సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.40 వేలు పంపిణీ చేశారు...!


Breaking.. సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు

రూ.40 వేలు పంపిణీ చేశారు...!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



2021 స్థానిక సంస్థల ఎన్నికలు.. లో ఓటు విలువ ఆకాశాన్ని అంటింది.సర్పంచ్, వార్డు ల పోలింగ్ ముందురోజున ఒక్కో ఓటు రూ.40వేలు చొప్పున ఓటర్లకు పంపిణీ చేసిన ఘటన పక్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో హల్..చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాకు చెందిన ఉండి మండలంలో ఓ చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య వెయ్యిలోపే. ఇక్కడ బరిలో నిలిచిన ఇద్దరు సర్పంచి అభ్యర్థులు రెండు విడతల్లో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచారు. ఇదే గ్రామంలో ఉప సర్పంచి పదవి రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డులో బరిలో నిలిచారు. ఆ వార్డులో 110 మంది ఓటర్లు ఉండగా వీరిద్దరూ చెరో రూ.10 వేల వరకు ముట్టజెప్పారు. మొత్తంగా ఆ వార్డులో ఓటుకు రూ.40 వేల చొప్పున అందాయి. ఇంత పెద్దఎత్తున ఓటర్లకు డబ్బు పంపిణీ జరిగిన విషయం వెలుగు చూడటం తో పలువురు విస్తు పోతున్నారు.

460 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon