• Neti Charithra

Breaking... సరదాగా .. వచ్చారు.. మృత్యువాత పడ్డారు..మూడు కుటుంబాల్లో విషాదం..!


Breaking... సరదాగా .. వచ్చారు.. మృత్యువాత పడ్డారు..మూడు కుటుంబాల్లో విషాదం..!



ప్రకాశం : నేటి చరిత్ర


ప్రకాశం జిల్లాల్లో పెను విషాదం ..చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన పిల్లలు ముగ్గురు మృత్యు వాత పడ్డం తో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. వేటపాలెం మండలం కఠారిపాలెం తీరంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదం నెలకొంది.గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన మద్దూరి భరత్‌రెడ్డి (20), ఆయన సోదరి మానస, ముత్యాలపేటకు చెందిన గట్టు మహేష్‌, వెంకటాపురానికి చెందిన మొగిలి ఉష (20), హైదరాబాద్‌కు చెందిన జస్వంత్‌.. కఠారిపాలెం తీరానికి వచ్చారు. అయిదుగురూ సముద్రంలో ఉండగా ఒక్కసారిగా పెద్ద అలలు వచ్చాయి. వాటిలో చిక్కుకున్న భరత్‌రెడ్డి, ఉష, మహేష్‌ గల్లంతయ్యారు. అక్కడే ఉన్న మత్స్యకారులు మిగిలిన ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. కాసేపటికి భరత్‌రెడ్డి, ఉష మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మహేష్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.