• Neti Charithra

Breaking.. సబ్ రిజిస్టార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు.. భారీగా అక్రమ నగదు పట్టివేత..!


Breaking.. సబ్ రిజిస్టార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు.. భారీగా అక్రమ నగదు పట్టివేత..!



హిందూపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా హిందూపురం సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంపై సోమవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ కడప డీఎస్పీ కులశేఖర్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 6.30 గంటలకు కార్యాలయం లోనికి వెళ్లిన అధికారులు సంబంధిత అధికారుల సమక్షంలో రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలించారు. ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ చేపట్టారు. కార్యాలయంలో పని చేసే సీనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు వెంట తీసుకెళ్లి వారి ఇంట్లో సోదాలు చేశారు. కార్యాలయంలో అనధికారికంగా విధులు నిర్వహించే ఇద్దరిని, కొందరు డాక్యుమెంట్‌ రైటర్లను అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు వద్ద అనధికారిక నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటే వరకు సోదాలు కొనసాగాయి. పూర్తి వివరాలు విచారణ అనంతరం వివరిస్తామని ఏసీబీ

డీఎస్పీ పేర్కొన్నారు.



348 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon