• Neti Charithra

Breaking.. శాసన మండలి డిప్యూటీ చెర్మన్ రైలు కింద పడి ఆత్మహత్య..అభిమానుల్లో విషాదం...!


Breaking.. శాసన మండలి డిప్యూటీ చెర్మన్

రైలు కింద పడి ఆత్మహత్య..అభిమానుల్లో విషాదం...!నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌, జెడిఎస్‌ ఎమ్మెల్సీ ధర్మె గౌడ ఆత్మహత్య

చేసుకోవడం సంచలనం కలిగించింది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిక్మంగుళూరు జిల్లా కదుర్‌ తాలూకా గుణసాగర్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహం లభ్యమైంది.

సోమవారం సాయంత్రం ధర్మెగౌడ ఇంటి నుండి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ గన్‌మెన్‌, పోలీసులు

ఆయన కోసం గాలించారు. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కల కలం రేపింది.