• Neti Charithra

Breaking.. శేషాచలం అడవుల్లో స్మగ్లర్ ల రాళ్ల దాడి..తుపాకులు గురిపెట్టిన పోలీసులు..!



Breaking.. శేషాచలం అడవుల్లో స్మగ్లర్ ల రాళ్ల దాడి..తుపాకులు గురిపెట్టిన పోలీసులు..!




తిరుపతి: నేటి చరిత్ర

శేషాచలం అడవుల్లో కి చొరబడ దానికి ప్రయత్నం చేసిన దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ ఆదివారం

తిరుపతి సమీపంలో తెల్లవారుజామున అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వద్ద ఉన్న

తుపాకులు చూసి చీకట్లో పారిపోయారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ లు వాసు, లింగాధర్ టీమ్ లు శనివారం మధ్యాహ్నం నుంచి తిరుపతి కరకంబాడీ అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. రాత్రి 12 గంటల సమయంలో, కరకంబాడీ రోడ్డు లోని ఎల్ ఐసి కాలనీ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులో నుంచి కొంతమంది తమిళ స్మగ్లర్లు వారం రోజులకు సరిపడే విధంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలతో దిగారు. అప్పటికే కొండపై ప్రాంతంలో ఉన్న వీరు ఉన్న వైపు వచ్చారు. అంతలో స్మగ్లర్లు ను వదిలి వ్యాను

వెళ్ళిపోయింది. టాస్క్ ఫోర్స్ ఒక్కసారిగా స్మగ్లర్లును చుట్టు ముట్టడంతో, కోపంతో రాళ్ల తో దాడి చేశారు. అంతలో తుపాకులు చూసి చీకట్లో కలిసిపోయారు. దాదాపు 75 కిలోల బియ్యం, కందిపప్పు ఇతర నిత్యావసర వస్తువులతో పాటు, కూరగాయలు, బీడీలు, టాబ్లెట్ లు ఇతర వస్తువులను వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న ఎస్పీ ఆంజనేయులు, డిఎస్పీ వెంకటయ్య సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్మగ్లర్లు పారిపోయిన వైపుకు ఒక టీమ్ ను పంపి గాలింపు లు చేపట్టారు. ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ స్మగ్లర్లు ను అడవుల్లో కి వెళ్లకుండా అడ్డుకోవడం తో దాదాపు 70 నుంచి 80 ఎర్రచందనం చెట్లను కాపాడ గలిగామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.