• Neti Charithra

Breaking.. శివరాత్రి వేడుకల్లో..విషాదం.. స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు..!


Breaking.. శివరాత్రి వేడుకల్లో..విషాదం.. స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు..!


కడప: నేటి చరిత్ర


మహా శివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది.. దైవ దర్శనానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నది లో గల్లంతు ఆయిన ఘటన కడప జిల్లా లో విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముద్దనూరు మండలం థర్మల్‌ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు.. వల్లూరు పరిధిలోని పుష్పగిరి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. పుష్పగిరి కొండపై వెలసిన సంతాన మల్లేశ్వర స్వామి, చెన్నకేశవులను దర్శించుకున్నారు. అనంతరం కొండ దిగువన పెన్నానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. స్నానం చేస్తున్న క్రమంలో నది లోపలికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు అక్కడ ఊబిలో చిక్కుకుని గల్లంతయ్యారు. గల్లంతైన వారిని కార్తీక్‌, నందకిశోర్‌గా గుర్తించారు. స్థానికంగా ఉన్న ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. భక్తుల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి