• Neti Charithra

Breaking.. శ్రీవారి మెట్లవద్ద టాస్క్ ఫోర్స్ దాడులు.. భారీగా పట్టుపడ్డ ఎర్రచందనం..!


Breaking.. శ్రీవారి మెట్లవద్ద టాస్క్ ఫోర్స్ దాడులు.. భారీగా పట్టుపడ్డ ఎర్రచందనం..!




తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా శ్రీవారిమెట్టు సమీపంలో గురువారం అర్ధరాత్రి ఎర్రచందనం స్మగ్లర్ల జాడ తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై దాడి చేశారు. అయితే స్మగ్లర్లు చీకటి లో పారిపోగా, వారి నుంచి 16 ఎర్రచందనం దుంగలు

లభ్యమయ్యాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు గారికి అందిన సమాచారం మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ లింగాధర్ టీమ్ గురువారం సాయంత్రం నుంచి శ్రీవారిమెట్టు నుంచి సచ్చినోడి బండ మీదుగా కూంబింగ్ చేపట్టారు. అర్థరాత్రి సమయంలో ఈతగుంట వద్ద స్మగ్లర్ల అలికిడి

వినిపించింది. దీంతో వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. అయితే స్మగ్లర్లు దుంగలను పడేసి చీకట్లో కలిసి పోయారు. దట్టమైన పొదలు వారు తప్పుంచుకోవడానికి దోహదపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


104 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon