• Neti Charithra

Breaking.. శ్రీవారి ఆలయానికి రూ.20 కోట్ల భూమి..రూ.3.16కోట్ల చెక్కు విరాళం..!


Breaking.. శ్రీవారి ఆలయానికి రూ.20 కోట్ల భూమి..రూ.3.16కోట్ల చెక్కు విరాళం..!తిరుమల: నేటి చరిత్ర


శ్రీవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు కుమారగురు టీటీడీకి శనివారం భారీ విరాళం అందజేశారు. తమిళనాడు రాష్ట్రం ఉల్లందూర్‌పేట్‌లో ఉన్న 4 ఎకరాల స్థలం, రూ.3 కోట్ల 16 లక్షల నగదును అందించారు. ఈ భారీ విరాళానికి సంబంధించిన డీడీలు, భూ పత్రాలను

తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డికి కుమారగురు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ మాట్లాడుతూ రూ.20 కోట్లు విలువ చేసే 4 ఎకరాల స్థలాన్ని ఇచ్చిన టీటీడీ బోర్డు సభ్యుడిని అభినందించారు. త్వరలోనే ఉల్లందూర్‌పేట్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని వివరించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడి చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.