• Neti Charithra

Breaking.. శ్రీకాళహస్తి కి వెళ్లి వస్తూ.. కారు బోల్తా..ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు..!


Breaking.. శ్రీకాళహస్తి కి వెళ్లి వస్తూ.. కారు బోల్తా..ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు..!చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం వద్ద వాహనం బోల్తా పడటంతో శనివారం ఒకరు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. స్థానిక పోలీసులు కథనం మేరకు..మండలంలోని క్షీర సముద్రం వద్ద తమిళనాడులోని గుడియాత్తం నగరానికి చెందిన కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో ఒక మహిళ మృతి చెందింది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా శనివారం

శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికుల సహకారంతో 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.