- Neti Charithra
Breaking.. విహార యాత్రలో విషాదం..కొండపై నుంచి కింద పడి గ్రామ వాలంటీర్ మృతి..!
Breaking.. విహార యాత్రలో విషాదం..కొండపై నుంచి కింద
పడి గ్రామ వాలంటీర్ మృతి..!
కడప: నేటి చరిత్ర
కడపజిల్లా లో విషాదం చోటు చేసుకుంది.
తోటి స్నేహితులతో విహార యాత్రకు వెళ్లిన ఓ గ్రామ వాలంటీర్ కొండ అంచునుంచి కిందపడి మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.చిన్నమండ్యం
మండల పరిధిలోని బోడిరెడ్డిగారిపల్లె సమీపంలోని అక్కులమ్మ కొండకు వచ్చిన చిన్నమండెంకు చెందిన గ్రామ వాలంటీరు షేక్ మహమ్మద్అలీ(25) ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. మహమ్మద్అలీ చిన్నమండెం-1 సచివాలయ పరిధిలో గ్రామ వాలంటీరుగా
పనిచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం సెలవు రోజు కావడంతో చిన్నమండెంకు చెందిన ఏడుగురు యువకులు కొండకు వచ్చారు. ఇక్కడ పైనుంచి వచ్చే నీటి దగ్గరకు వెళ్లారు. యువకులు నీరు దూకే చోటికి వెళ్లగా అక్కడ మహమ్మద్అలీ ప్రమాదవశాత్తు కాలు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న గ్రామస్థులు వెళ్లి యువకుడి మృతదేహాన్ని కొండ నుంచి కిందికి దించి స్వగ్రామానికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ లింగప్ప, ఎస్సై హేమాద్రిలు మహమ్మద్ అలీ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.