• Neti Charithra

Breaking..వైసీపీ శ్రేణుల సమావేశం లో అపశృతి.. చెట్టు కూలి..ఇద్దరు మృతి..!


Breaking..వైసీపీ శ్రేణుల సమావేశం లో అపశృతి.. చెట్టు కూలి..ఇద్దరు మృతి..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


పశ్చిమ గోదావరి జిల్లా తణుకు

లో శనివారం అపశృతి చోటు చేసుకుంది.

వైసీపీ శ్రేణుల సమావేశం జరుగుతున్న సందర్భంగా కొబ్బరి చెట్టు కూలడంతో అక్కడే ఇద్దరు మహిళలు చనిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం నుంచి

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున మండలంలోని రేలంగి గ్రామంలో జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. పట్టాల పంపిణీ కోసం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కారుమూరి

వెంకటనాగేశ్వరరావు పార్టీ శ్రేణులతో

సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలో మహిళలు కూర్చున్న చోట ప్రమాదవశాత్తుపెద్ద

కొబ్బరిచెట్టు కూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కాసాని దుర్గా భవాని(30), శాంతకుమారి(35) అనే ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్