• Neti Charithra

Breaking.. వైసీపీ నేతల వేధింపులు తాళ లేక చిత్తూరు జిల్లాలో సంఘమిత్ర ఆత్మహత్యాయత్నం..!


Breaking.. వైసీపీ నేతల వేధింపులు తాళ లేక చిత్తూరు జిల్లాలో సంఘమిత్ర ఆత్మహత్యాయత్నం..!




నిమ్మనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె కు చెందిన ఓ సంఘమిత్ర అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కల కలం రేపింది. నిమ్మనపల్లె మండలం అగ్రహారం గ్రామం లో గత తొమ్మిది సంవత్సరాలుగా చైతన్య గ్రామ సంఘం లో సంఘమిత్ర గా పనిచేస్తున్న విజయ లక్ష్మి( 45) ని అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారని తనపై

అన్యాయంగా విధుల నుండి తొలగించారని ఆరోపిస్తూ ఆమె పురుగుల మందు తాగి తన మృతి కి అదికార పార్టీ నేతలు కారణం అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా మారటం తో ఆమె ను తిరుపతి రుయా కు తరలించారు.