• Neti Charithra

Breaking... వైసీపీ కుప్పం లో రూ.50 కోట్లు ఖర్చు చేసింది- చంద్రబాబు ఫైర్..!


Breaking... వైసీపీ కుప్పం లో రూ.50 కోట్లు ఖర్చు చేసింది- చంద్రబాబు ఫైర్..!


కుప్పం: నేటి చరిత్ర


ఏపీ లో పాలకులు దౌర్జన్యాలతో పాలన చేయాలని చూస్తున్నారని.. ఇది తాత్కాలికం మాత్రమే నని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం కుప్పం, గూడు పల్లి మండలాల్లో పర్యటించిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి

మాట్లాడారు.నన్ను ఎన్ని అవమానాలకు గురిచేస్తున్నారో మీరు చూస్తున్నారు. నాకు మళ్లీ సీఎం పదవి అవసరమా? కానీ..రాష్ట్రం, ప్రజలు, నమ్ముకున్న కార్యకర్తల కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నా. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వంపై విశ్వసనీయత పోయింది. 20 నెలల్లోనే సీఎం చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది కలెక్టర్లు, ఎస్పీలను చూశాను. ఇప్పుడు వాళ్ల నిజస్వరూపం

బయటపడింది. ఇవన్నీ నాకు కూడా మంచి గుణపాఠాలు. మనం భయపడితే బెదిరిస్తారు. తిరుగుబాటు చేస్తే నోరుమూస్తారు. నియోజకవర్గంలో కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండాలి. నాయకత్వాన్ని గౌరవించాలి. బాగా పనిచేసే వారిని ముందుకు తీసుకెళ్లాలి. సమర్థ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తా. కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటా’’ అని చంద్రబాబు అన్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్