• Neti Charithra

Breaking.. విషాదం.. ఆగివున్న లారీ ని ఢీకొన్న కారు ముగ్గురు మృతి..!


Breaking.. విషాదం.. ఆగివున్న లారీ ని ఢీకొన్న కారు ముగ్గురు మృతి..!


హైదరాబాద్: నేటి చరిత్ర


ఆగివున్న లారీ ని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన ఘటన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..హైదరాబాద్‌ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్‌పై మంగళవారం. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాలు అందులో ఇరుకుపోయగా.. వాటిని పోలీసులు వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమదానికి, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.