- Neti Charithra
Breaking.. విశాఖ స్టీల్ ప్లాంట్ .. ఉద్యమానికి.. టీడీపీ అండ- చంద్రబాబు నాయుడు..!
Breaking.. విశాఖ స్టీల్ ప్లాంట్ .. ఉద్యమానికి.. టీడీపీ అండ- చంద్రబాబు నాయుడు..!
విశాఖ: నేటి చరిత్ర
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు గజన స్వాగతం పలికారు. ప్రజలను ఉదేశించి మాట్లాడుతూ
స్టీల్‌ప్లాంట్ లేకపోతే విశాఖ లేదని, నాడు జరిగిన ప్రాణత్యాగాలను నేడు జగన్ అవమానిస్తున్నారని టిడిపి అధినేత
చంద్రబాబు విమర్శించారు. అలాగే విశాఖ ఎప్పటికీ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగానే ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌కు ఆనాడు విశాఖే మంచిదని కమిటీ నివేదిక ఇవ్వడంతో ఇందిరాగాంధీనే దిగొచ్చారని గుర్తు చేశారు. నాడు రైతులు ఇచ్చిన భూమి విలువ నేడు కోట్ల ధర పలుకుతోందని తెలిపారు. అనంతరం ఆయన అధికారపార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.