• Neti Charithra

Breaking..విశాఖ, విజయనగరం జిల్లాలో టీడీపీ పర్యటనకు అడ్డంకులు..రోడ్డు పై బైఠాయించి న చంద్రబాబు..!


Breaking..విశాఖ, విజయనగరం జిల్లాలో

టీడీపీ పర్యటనకు అడ్డంకులు..రోడ్డు పై బైఠాయించి న చంద్రబాబు..!


విజయనగరం: నేటి చరిత్ర


టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు విశాఖ, విజయ నగరం జిల్లాల్లో శనివారం ఘట స్వాగతం లభించింది. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు విశాఖ టీడీపీ నాయకులు భారీగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లారు.ఈ క్రమంలో చంద్రబాబు

కాన్వాయ్‌లోని తెదేపానేతల వాహనాలను విజయనగరం మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది వాహనాలను మాత్రమే అనుమతించి నేతల వాహనాలను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ విజయనగరంలో

చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విజయనగరంలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నేతల వాహనాలు వెళ్లకుండా లారీలు అడ్డుపెట్టారు.

282 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon