• Neti Charithra

Breaking.. వివాహితపై..అఘాయిత్యం..ఎమ్మెల్యే అనుచరునికి దేహశుద్ధి..!


Breaking.. వివాహితపై..అఘాయిత్యం..ఎమ్మెల్యే అనుచరునికి దేహశుద్ధి..!



కర్నూలు:నేటి చరిత్ర


ఓ మహిళ పై అఘాయిత్యానికి పాల్పడ్డ

ఓ ఎమ్మెల్యే అనుచరుడి కి ప్రజలు దేహశుద్ధి చేసిన ఘటన కర్నూలు జిల్లా లో చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.

సి.బెళగల్‌ మండలంలోని బురాన్‌దొడ్డి గ్రామంలో కోడుమూరు ఎమ్మెల్యే అనుచరుడు వీరకుమార్‌ ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త వీరకుమార్‌ గతేడాది డిసెంబర్‌ 31న అర్ధరాత్రి మద్యం సేవించి ఓ వివాహిత ఇంట్లోకి చొరబడి బలాత్కరించబోయాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి కామంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.శనివారం భర్త సాయంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.