• Neti Charithra

Breaking.. వారపు సంత లో వాటర్ ట్యాంక్ ఎక్కిన 20మందిమహిళలు..మదనపల్లె లో ఉద్రిక్తత..!


Breaking.. వారపు సంత లో వాటర్ ట్యాంక్ ఎక్కిన 20మందిమహిళలు..మదనపల్లె లో ఉద్రిక్తత..!



మదనపల్లె: నేటి చరిత్ర


(మదనపల్లె లో నీటి ట్యాంక్ ఎక్కి

నిరసనలకు దిగిన మహిళలు)


చిత్తూరు జిల్లా మదనపల్లె లో వారపు సంత లో ఆక్రమణలు తొలగించాలని పలువురు మహిళలు ఓవర్ హెడ్ ట్యాంక్ ను ఎక్కి నిరసనలకు దిగడంతో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. వారపు సంత లో ఆక్రమణలు తొలగింపు వివాదం తారా స్థాయికి చేరింది. ఈ

వివాదం పై రెండు మాసాలుగా ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మదనపల్లె అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సుమారు 20 మంది మహిళలు నీటి ట్యాంక్ ఎక్కి నిరసనలు కు

దిగటం తో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. పట్టణం లో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.