- Neti Charithra
Breaking.. వ్యాపారి..కిడ్నాప్ .. గంట లో నిందితుల ను అరెస్ట్ చేసిన తిరుమల పోలీసులు..!
Breaking.. వ్యాపారి..కిడ్నాప్ .. గంట లో నిందితుల ను అరెస్ట్ చేసిన తిరుమల పోలీసులు..!
నేటి చరిత్ర: తిరుమల
ప్రముఖ పుణ్య క్షేత్రంతిరుమలలో ఆదివారం రాత్రి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తమై నిందితులను గంట సమయంలో నే అరెస్ట్ చేశారు. తిరుమల డీఎస్పీ ప్రభాకర్బాబు కథనం మేరకు
.. నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన హనుమంతరావు (40) తొమ్మిది మంది కుటుంబసభ్యులతో కలిసి శనివారం తిరుమలకు కాలినడకన వచ్చారు. ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. అయితే సాయంత్రం ఎస్పీటీ అతిథిగృహం సమీపంలో నలుగురు దుండగులు కారులో వచ్చి హనుమంతరావును అపహరించుకుని వెళ్లారు.బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా అలిపిరి తనిఖీ కేంద్రాన్ని అప్రమత్తం చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులు అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన కె.శ్రీనివాస్, మారుతి, పుట్టపర్తికి చెందిన పి.కుమార్, చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన సురేష్లుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆర్థిక లావాదేవీల్లో
హనుమంతరావు శ్రీనివాస్ వద్ద రూ.20 లక్షలు తీసుకున్నారని.. లాక్డౌన్ కారణంగా ఆ డబ్బును తిరిగి ఇవ్వలేకపోవటంతో హనుమంతరావును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపోయారు.