• Neti Charithra

Breaking... వ్యవసాయ భూమి తాకట్టుకు.. ఒప్పుకోలేదని..అన్న ను నరికి చంపిన తమ్ముళ్లు..!


Breaking... వ్యవసాయ భూమి తాకట్టుకు.. ఒప్పుకోలేదని..అన్న ను నరికి చంపిన తమ్ముళ్లు..!


హైదరాబాదు: నేటి చరిత్ర



తాకట్టు పెట్టేందుకు.. భూమికి సంబంధించిన పాసు బుక్కు ఇవ్వలేదని కోపం తో సాక్షాత్తు సోదరులే అన్నను ..దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణా లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..శంకర్‌పల్లి సీఐ గోపినాథ్‌

కథనం మేరకు..ఠాణా పరిధిలోని టంగటూర్‌కు చెందిన యాదయ్య(48), పాండు(45), రాజు(42), శ్రీను(40)

నలుగురు అన్నదమ్ములు. గత నెల 5న రాజు(42) లైంగిక వేధింపుల కేసులో నాలుగేళ్ల శిక్ష పడగా.. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. రాజుని విడిపించేందుకు ముగ్గురు సోదరులు తమకున్న రెండు ఎకరాల లవణి పట్టా భూమిని తాకట్టు పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. పాసుపుస్తకాలను యాదయ్య(48) వద్ద ఉంచారు. అనంతరం ఏమైందో..వాటిని తాకట్టువిషయం లో అనుమానం తో పాండు, శ్రీను తిరిగి ఇచ్చేయాలని అన్న యాదయ్యపై ఒత్తిడిపెంచారు. అయితే అతని ఇచ్చేందుకు యాదయ్య

ససేమిరా అన్నాడు. దీంతో కక్ష పెంచుకున్న పాండు, శ్రీను శుక్రవారం యాదయ్యను గొడ్డలి, ఇనుప రాడ్డుతో దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.