- Neti Charithra
Breaking.. వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ పనులు చేస్తుండగా ఘోర ప్రమాదం. పొలంవద్ద.. రైతు మృతి..!
Breaking.. వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ పనులు చేస్తుండగా ఘోర ప్రమాదం.
పొలంవద్ద.. రైతు మృతి..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం లో జరిగిన విద్యుతా ఘాతం తో ఓ రైతు మృత్యువాత పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఇద్దంపల్లి గ్రామ విద్యుదాఘాతానికి గురై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన జల్లెల కొండల్‌యాదవ్(30) రెండు ఎకరాల్లో పత్తి, వరి సాగు చేస్తున్నారు. స్థానికంగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటకు నీటి అవసరం ఏర్పడింది. మూడు రోజులుగా విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురవడంతో రైతే స్వయంగా మరమ్మతు చేయడానికి సిద్ధమయ్యారు. ముందుగా విద్యుత్తు
సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించి లైన్ బంద్ చేయించారు. ట్రాన్స్ఫార్మర్ పక్కనే అదే సబ్‌స్టేషన్ పరిధికి చెందిన మరో లైన్ ఉంది. ఆ విషయాన్ని మరచిన రైతు ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పక్క లైన్ తగిలి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు