• Neti Charithra

Breaking.. విద్యార్థి వద్ద 10 వేలు లంచం.. తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ప్రధానోపాధ్యాయుడు..!


Breaking.. విద్యార్థి వద్ద

10 వేలు లంచం.. తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ప్రధానోపాధ్యాయుడు..!
ఏలూరు: నేటి చరిత్ర

తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారి..

పూర్వ విద్యార్థి నుంచి రూ. పది వేలు లంచం తీసుకుంటూ పక్షిమ గోదావరి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన చోటుచేసుకుంది.

పెనుగొండ జడ్‌ఎన్‌వీఆర్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.శ్రీనివాస్‌ను గురువారం ఏసీబీ డీఎస్పీ ఎస్‌.

వెంకటేశ్వరరావు(ఏలూరు) ఆధ్వర్యంలో అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం. పెనుగొండ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి నూలు సూర్య ప్రకాష్‌ పదో తరగతి మార్కుల జాబితా కోసం దరఖాస్తు చేశారు. ధ్రువ పత్రం కోసం రూ. 10వేలు ఇవ్వాలని

డిమాండ్‌ చేయడంతో సూర్యప్రకాష్‌ ఎసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు తనతో పాటు సీఐలు కే. శ్రీనివాస్‌, ఎం‌. రవిందర్‌లు శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.