• Neti Charithra

Breaking... విద్యార్థినుల పట్ల.. అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు కి దేహశుద్ధి..!


Breaking... విద్యార్థినుల పట్ల.. అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు కి దేహశుద్ధి..!



శ్రీకాకుళం: నేటి చరిత్ర


అతను ఆదర్శంగా ఉండాల్సిన ప్రధానోపాధ్యాయుడు.. పిల్లలకు

విద్యా బుద్దులు నేర్పించాల్సిన వ్యక్తి.. తన వద్ద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పట్ల అసభ్య తీరును భరించలేక.. అతనికి దేహశుద్ధి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా లో చోటుచేసుకుంది. పొందూరు మండలం లైదాంలో చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీ కృష్ణ తమతో అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యా యుడిని చితకబాదారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదని.. అందుకే దేహశుద్ధి చేశామని గ్రామస్థులు తెలిపారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.