- Neti Charithra
Breaking...విద్యార్థినుల ఎదుట అసభ్య డాన్సులు..ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..!
Breaking...విద్యార్థినుల ఎదుట అసభ్య డాన్సులు..ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
ఏపీ ప్రభుత్వం న్యూఇయర్ వేడుకలను
అధికారికంగా రద్దు చేసింది. ఈ నిర్ణయం తో ప్రముఖ పర్యాటక కేంద్రాలు సైతం మూగ
పోయాయి. అయితే అంసుకు విరుద్ధంగా ఓ ప్రిన్స్ పాల్ బీసీ వెల్పేర్ పరిలోని పాఠశాల లో న్యూఇయర్ వేడుకలు పేరుతో విద్యార్థినులు ఉండే సముదాయం లో నే విద్యార్థినుల సమక్షంలో డ్యాన్సులు చేసిన విషయం వెలుగు చూడటం తో ఆ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా గుడిబండ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
గుడిబండ బీసీ వెల్ఫర్ స్కూల్ లో
ప్రిన్సిపల్ నాగరాజు గర్ల్స్ క్యాంపస్ లోకి బయటి వ్యక్తులను అనుమతించి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు.. కేక్ కట్ చేశారు. అంతటితో ఆగలేదు. బాలికల ముందే అసభ్యకరంగా డ్యాన్సులు చేశాడు.. ఈ సీన్ మొత్తాన్ని అక్కడే ఉన్న ఎవరో మొబైల్లో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి.. గర్ల్స్ క్యాంపస్లో న్యూఇయర్ వేడుకలు జరిపి.. బయటి వారిని పిలిచినందుకు ప్రిన్సిపల్ నాగరాజుపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలను పరిశీలించి ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు టీచర్ల కు మెమోలు జారీ చేశారు.